ఎన్నికల సమర శంఖారావం పూరించిన బత్తుల

  • విజయమే లక్ష్యంగా ‘బలరాముడి’ భారీ యుద్ధం…

రాజానగరం నియోజకవర్గం: శ్రీరాంపురం గ్రామంలో.రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు గ్రామంలో కొలువై, ఎంతో విశిష్టత కలిగిన “శ్రీ అభయాంజనేయ స్వామి” వారిని దర్శించుకుని అనంతరం రేపు రాబోవు ఎన్నికల్లో వైసీపీ పై జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దశాదిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ ఈ రోజు నుండి రోజుకు 15 గంటల పాటు.. మా కుటుంబం నుండి ఐదుగురు (బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, అల్లుడు తోట పవన్ కుమార్, కుమార్తెలు ప్రత్యూష దేవి, వందనాంభిక) రాజానగరం, కోరుకొండ, సీతానగరం మూడు మండలాలలో నిరంతరం పాదయాత్రలు చేస్తూ.. నిర్విరామంగా క్షేత్రస్థాయిలో అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేస్తూ.. పార్టీని బలపరుస్తూ.. ప్రజలకు అండగా ఉంటూ, వారికి అభయ హస్తం అందిస్తూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి సహకారంతో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. ఆత్మవిశ్వాసం, మడమతిప్పని పోరాట పటిమ, పట్టుదల, కఠోర శ్రమ, గెలుపే ఆయుధాలుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుదాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి రాజానగరం నుండే అత్యధిక భారీ మెజారిటీని అందిద్దాం. వైసీపీ పై పోటీకి దీటుగా ముందుకు కదులుతూ “జనసైన్యం” దమ్ముగా గళమెత్తి గర్జించాలి. అధికార పార్టీ “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు. రాజానగరం నియోజకవర్గంలో వైసిపి అరాచక, అవినీతి, రౌడీ పాలన నుండి రాజకీయం, ప్రజలు విముక్తి పొందాలంటే, యువత ధైర్యంగా ముందుకు రావాలి. కొత్త రాజకీయ వ్యవస్థను అందిద్దాం.. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుదాం.. ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చి.. సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా “జనసేన పార్టీ”కి మాత్రమే ఉంది. ప్రజల్లో మార్పు మొదలైంది, నిజాయితీని కోరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పని తీరును, అవినీతిని వ్యతిరేకిస్తున్నారు. జనసేన పార్టీ చాపకింద నీరులా అన్ని గ్రామాలకు వేగంగా విస్తరిస్తుంది, వైసిపి నేతలు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ధర్మం వైపు నిలబడ్డాం, అంతిమ విజయం మనదే. నియోజకవర్గంలో వైసిపి పూర్తిగా అస్తిత్వం కోల్పోతుంది, వాళ్ల కుంభస్థలాన్ని మనం కొట్టిన దెబ్బకు కకావితలం అవుతుంది. సమైక్యంగా, సంఘటతంగా, సమన్వయంతో..టిడిపి తో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ.. గెలుపే లక్ష్యంగా అవిశ్రాంతంగా పోరాడి జనసేన పార్టీకి భారీ విజయాన్ని అందిద్దాం. మాపై చూపిస్తున్న విశేషమైన ప్రేమాభిమానాలకు, ఆదరణకు, నమ్మకానికి కృతజ్ఞులమై ఉంటాం.. నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ అవినీతి పార్టీకి అంతం.. జనసేన ప్రజా రాజకీయానికి ఆరంభం, అభివృద్ధి జరగాలంటే, అరాచకం ఆగాలంటే, జనం బాగుండాలంటే ఒకటే నినాదం.. హలో ఏపీ.. బై బై వైసీపీ.. హాల్లో రాజానగరం.. వెల్కం జె ఎస్ పి.