జనసైనికుల వ్యాపార ప్రారంభోత్సవాలలో బత్తుల దంపతులు

  • శ్రీకాంత్ జిఎస్ నూతన వ్యాపార ప్రారంభం

రాజమహేంద్రవరం వాస్తవ్యులు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన శ్రీకాంత్ జిఎస్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల శ్రీమతి వెంకటలక్ష్మి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో శ్రీకాంత్ జిఎస్ బాగా రాణించాలని ఆశిస్తున్నట్లు బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.

  • శ్రీ సత్య దుర్గ స్వీట్ స్టాల్ ప్రారంభం

కొండగుంటూరు వాస్తవ్యులు ఈవూరి శ్రీనివాస్ నూతన వ్యాపారమయిన శ్రీ సత్య దుర్గ స్వీట్ స్టాల్ ను ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో శ్రీనివాస్ బాగా రాణించాలని ఆశిస్తున్నట్లు బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరిగెల రామకృష్ణ, జగత వీరభద్రరావు, కొప్పిరెడ్డి బాబి, ఆనెం వీరభద్ర స్వామి, పల్ల స్వామి, మేడిశెట్టి సాయి, గిరిజాల మణి, కూరపాటి వెంకన్నబాబు, సోడసాని మనీష్ కుమార్, అగర్తి రాజిని కాంత్, సలాది రమేష్ తదితరులతో పాటు కొండగుంటూరు మరియు సంపత్ నగరం జనసేన శ్రేణులు పాల్గొన్నారు.