అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమంగా అమ్మిన వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ భూములు కాపాడాలని పోరాటం చేస్తున్న వారిపై నిరాధార ఫిర్యాదు చేయడం హేమాయమైన చర్య జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన పొన్నలూరు లోని జిల్లా పరిషత్తు భూములు సర్వే నం: 265, 266 ప్రభుత్వ భూములు కొందరు ప్రయివేటు వ్యక్తులు ఆక్రమించి అమ్మిన విషయం తెలిసిందే. కాగా జడ్పీ భూములు కాపాడాలని గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త హుస్సేన్ తోపాటు మరో నలుగురిపై నిరాదమైన ఫిర్యాదు చేయడం పిరికిపంద చర్య అని మనోజ్ విమర్శించారు. జడ్పీ స్థలాల ఆక్రమణలపై మేము చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఏ. ఎస్. దినేష్ కుమార్ వెంటనే స్పందించి ఏ.డి సర్వే & ల్యాండ్స్ ఆధ్వర్యంలో ఒకవైపు కొలతలు కొలుస్తుండగా? జెడ్పీ స్థలాలు ఆక్రమించి అమ్మిన వారిని అరెస్టు చేసి అక్రమ కట్టడాలను తొలగించకుండా ఆక్రమణ దారులకు అధికారులు అండగా నిలవడం మండల ప్రజలను ఒకింత ఆశ్చర్యనికి గురిచేస్తోంది. అక్రమ కట్టడాలు జరిగాయని చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారి పిర్యాదు పై కేసు నమోదు చేయించడంలో ఎంపీడీఓ ఎందుకు శ్రద్ధ చూపలేదని పలు విమర్శలకు తావిస్తోంది. ఎంపీడీవో గారు ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినట్టా…? లేక ఫిర్యాదు చేయనట్టా..? ఫిర్యాదు చేస్తే అక్రమ కట్టడాలు ఎందుకు నిలిపివేయలేదు..? లోపం ఎక్కడ ఉంది..? ఏది ఏమైనా ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం ఆగదని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేసారు.