మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా బత్తుల – 250 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

రాజానగరం, మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై ఇంట్లో నడుము లోతు నీరు నిలిచిపోవడం వల్ల కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా జనం ఇక్కట్లు పడుతున్నారు. త్రాగేందుకు నీరు లేదు. నిత్యవసర సరుకులు అన్నీ తడిచిపోయి పాడైపోయాయి. భోజనం టిఫిన్ వంటి కనీస ఆహారం లేక చిన్న పిల్లలు, వయోవృద్ధులతో కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నారు. వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వాధికారి గాని, ప్రజా ప్రతినిధులు గాని, ఓట్ల కోసం వెంబడించే వాలంటీర్లు గాని, స్థానిక ఎమ్మెల్యే గాని చూసిన పాపాన పోలేదు. ప్రజలంతా తిండి, నిద్ర కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో రోడ్లపై మేడలపై, ఇంటి ముంగిట వరద నీటిలో నిలుచుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ తన టీంతో వచ్చి కన్నీటి పర్యంతమై తక్షణం 250 మంది దివాన్ చెరువు గ్రామ ప్రజలకు బియ్యం, కూరగాయలు, మంచినీరు, నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

పలువురిని పరామర్శించిన బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం గాడాల గ్రామంలో పలువురిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. చెల్లమశెట్టి నాగలక్ష్మికి ఇటీవల ప్రమాదంలో కాలికి గాయం అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దొడ్డ నాగన్న రెండు గేదెలు ఇటీవల తుఫాన్ కారణంగా భారీ గాలులు వలన రేకుల షెడ్ కూలిపోవడం వలన మరణించిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

తోకాడ గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం నియోజకవర్గం, తోకాడ గ్రామంలోని ప్రజలు బత్తులకు బ్రహ్మరథం పట్టారు. జనంకోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు వారి కుమార్తెలు శ్రీమతి ప్రత్యూష దేవి, బత్తుల వందనాంబికలు శుక్రవారం తోకాడ గ్రామంలో పర్యటించారు. వీరిని గ్రామంలోని ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ వారి కష్టాలు, బాధలు తెలియజేయడం జరిగింది. ఈ యాత్ర ప్రజల్లో జనసేన పట్ల ముఖ్యంగా బత్తుల బలరామకృష్ణ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, ఈ కుటుంబం మీద ఉన్న గౌరవం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే పట్ల అతని అవినీతి, నిరంకుశ ధోరణి, నిర్లక్ష్య వైఖరి పట్ల జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన దుర్మార్గాలను కథలు కథలుగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు తోకాడ గ్రామంలో గడపగడపకు వెళుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఆవశ్యకతను వివరించడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయకుండా ఇంకా ఇంకా సరికొత్త సమస్యలను సృష్టిస్తున్న భూ బకాసురుడు జక్కంపూడి రాజా వల్ల నియోజకవర్గం నాశనం అయిందని జనం వెల్లువలా బత్తుల వారి వెంబడి నడుస్తూ మహాపాదయాత్రను విజయవంతం చేశారు. గ్రామంలో కొందరు జనం తమ గ్రామ యువతను పెడదారిన పెట్టిస్తున్న జక్కంపూడి కుటుంబం గురించి గోడు వెల్లబోసుకున్నారు. దీనికి స్పందిస్తూ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గెలిచిన వెంటనే నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ గాని, డ్రగ్స్ దందా చేసే వారిని గానీ ఏరివేస్తానని, యువతను విద్య వైపు, ఉపాధి అవకాశాలను సృష్టించి సరైన జీవనం వైపు మరలేలా చేస్తానని మాట ఇచ్చారు. యువతకు పెడదోవ పట్టిస్తున్న నాయకులకు గుణపాఠం నేర్పుతామని తెలిపారు. జనం గురి అంతా బత్తుల వైపు ఉండడం వారి సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడటం వల్ల గ్రామం మొత్తం బత్తుల కుటుంబ సభ్యుల మహాపాదయాత్రను దిగ్విజయం చేస్తూ జై బత్తుల జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.