కోరుకొండ మండలంలో బత్తుల సుడిగాలి పర్యటన

  • కోరుకొండ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల
  • గాయాలపాలై చికిత్స పొందుతున్న శోభనబాబును పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో తుంపాడ శోభనబాబు గత కొన్నిరోజుల క్రితం సిమెంట్ పనిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.

  • పెద్ద గంగారాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామం లో లంక పెద్ద గంగారాజు గత కొన్ని రోజులక్రితం స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది.

  • వేమూరి ధనరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామం లో వేమూరి ధనరాజు పెద్ద కార్యం (పెద్ద రోజు) కార్యక్రమంలో పాల్గొని వారి ఆత్మకు శాంతి కోరాలని ప్రార్ధించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”.

  • జల్లి అంతలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో జల్లి అంతలక్ష్మి అకాల మరణ వార్త స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” వారి కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

  • పుప్పాల వీర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో పుప్పాల వీర్రాజు భార్య రావయ్యామ్మ పెద్దకార్యం (పెద్దరోజు) కార్యక్రమంలో పాల్గొని వారి ఆత్మకు శాంతి కోరాలని ప్రార్ధించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.