కోడూరి శివకి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల వెంకటలక్ష్మి

  • వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 10,000/- ఆర్థికసాయం

రాజనగరం నియోజకవర్గం, సీతానగరం మండలం వెలమపేట గ్రామానికి చెందిన కోడూరి శివ కొంతకాలంగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వెలమపేటలోని శివ గృహానికి వెళ్లి అతనిని పరామర్శించడం జరిగింది. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసైనికుల చేతుల మీదుగా కోడూరు శివకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు మట్ట వెంకటేశ్వరరావు, మాధవరావు వీరభద్రరావు, రొంగలి అభిరామ్ నాయుడు, కవల సురేష్, బైలపూడి శ్రీను, గోకాడ సూర్యవతి, రవి, సందీప్, నాగేంద్ర, అడపా నరసింహ, ప్రగడ శ్రీహరి, ముత్యాల మహేష్, నారాయడు, కిలాడి యర్రయ్య, ప్రసాద్, బ్రహ్మం, వివేక్, సీరంగం మణి తదితరులతో పాటు జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.