వైసీపి నేతల వ్యాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు

  • ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లిక గార్గ్ ని కలిసి జనసేన నాయకుల ఫిర్యాదు

ప్రకాశం జిల్లా, ఒంగోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ కుమార్ హెచ్చరించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్థాయి మరచి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, ముందు నీ స్థాయి ఎంతో తెలుసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు సుధాకర్ బాబుని దగుల్బాజీ, దోపిడీదారు, మహిళల్ని లైంగికంగా వేధిస్తూ ఉంటాడని, నియోజక వర్గ ప్రజలు అనుకుంటున్నారని, దానికి సుధాకర్ బాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ప్రజాదరణ తట్టుకోలేక అక్కసుతో ముఖ్యమంత్రి వీళ్ళందరి చేత ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. పాపం సుధాకర్ బాబు పవన్ కళ్యాణ్ ని తిడితే మంత్రి పదవి వస్తుందనే భ్రమలో ఈవిధంగా మాట్లాడుతున్నారని, ఇంక ఆ అవకాశం లేదు కాబట్టి విరమించుకుని నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. మీ పార్టీలో మీ విలువెంతో చూసుకోవాలని, మీ పార్టీ కార్యకర్తలు సైతం మిమ్మల్ని నల్ల జెండాలతో స్వాగతం చెబుతున్నారని, మీ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలతో ప్రజలు విసుగెత్తి పోయారని, చేతనైతే దాన్ని సరిచేసుకోవాలి హితవు పలికారు. మంత్రులు విశాఖపట్నంలో రెచ్చగొట్ట లేదు అనేది నిజమైతే, మంత్రి రోజా మధ్య వేలు ఎవరికి చూపించినట్టు? మీకా? మీ ముఖ్యమంత్రికా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వివాహాలపై, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ముందు, మీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు గురించి కూడా తెలుసుకోవాలని, దుయ్యబట్టారు. సుధాకర్ బాబు ఇలాంటి ప్రవర్తన మార్చుకోకపోతే, నియోజకవర్గంలో కూడా తిరగనివ్వమనే, సంతనూతలపాడు నియోజకవర్గం ప్రజల పరువు తీస్తున్నారని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గౌతమ్ రాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేకనే, జగన్ రెడ్డి కొంత మంది మానసిక రోగులతో పవన్ కళ్యాణ్ పై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, బెదిరింపులు చేయిస్తున్నారని, కులాల మధ్య చిచ్చు రేపే మరో కుట్ర కూడా ఉందని, ఇలాంటి అరాచక రాజకీయ విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. జనసేన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మలగా రమేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యక్తిగత దాడుల్ని ఖండించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు. మరోసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తన పద్దతి మార్చుకోవాలని, దమ్ముంటే నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. కృష్ణా పెన్నా రీజియన్ వీర మహిళా విభాగం కోఆర్డినేటర్ బోందిల శ్రీదేవి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ని, వారి కుటుంబ సభ్యులను వ్యక్తి గతంగా విమర్శించి పరువుకు భంగం కలిగించాలని చూస్తే నాలుక తెగ్గొస్తాం అని బోరుగడ్డ అనిల్ ని పరుషంగా హెచ్చరించారు.

తదనంతరం, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చపెట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొరుగడ్డ అనిల్ అనే మానసిక రోగితో జవసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సభ్య సమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయిస్తున్నారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లిక గార్గ్ ని కలిసి జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
ఎస్పీని కలిసిన వారిలో ఒంగోలు నగర అధ్యక్షుడు మాలగా రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, రాయపాటి అరుణ ఉన్నారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు, నాయకులు చెరుకూరి ఫణి కుమార్, మనోజ్, శిరీష, ప్రమీల, ఉషా, వాసుకీ, శ్రీనివాస్ పవన్, కృష్ణ, నరేంద్ర, నరేష్, మధు, భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.