వర్షాలకు పాడైపోయిన వరి పొలాలను పరిశీలించిన బెల్లంకొండ సాయిబాబు

గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు కంబం చెరువు కట్ట క్రింద వరి పంటను పరిశీలించిన జనసేన జిల్లా నాయకులు. కంభం చెరువులో నీళ్ళు లేక ఎనిమిది సంత్సరాలుగా వరి పంట వేయలేదు. ఈ సంవత్సరం పంట వేసిన రైతులకు పంట పండి చేతికి వచ్చే సమయంలో 15 రోజులు వరుసగా కురిసిన వర్షాలకు వరిపంటకు పూర్తిగా నష్టం జరిగినది. పెట్టిన పెట్టబడి, శ్రమ వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైతు యొక్క బాధలు తెలుసుకొన్న జనసేన నాయకులు ప్రభుత్వం వెంటనే ప్రతి రైతుకు 25000 ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, సంయుక్త కార్యదర్శులు కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, కంభం మండలం జనసేన నాయకులు తడిసెట్టి ప్రసాద్, మద్దు బ్రమ్మయ్య, బెస్టవారపేట మండలం నాయకులు దుమ్మని చెన్నయ్య, లక్కంనేని వెంకటనారాయణ, దొర నాగేంద్ర రైతులు పాల్గొన్నారు.