క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ కు శుభాకాంక్షలు

మన దేశ క్రికెట్ జట్టు తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆంధ్ర ప్రదేశ్ యువ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపించారు. ఆ మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీతో తన ప్రతిభ చూపిన భరత్ జాతీయ జట్టులో కూడా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ యువ క్రికెటర్ స్ఫూర్తితో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత మంది యువతీ యువకులు క్రీడా రంగం వైపు ఉత్సాహంగా ముందుకు రావాలి.