జనసేన పార్టీలో చేరిన భైంసా యువకులు

భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో పలు కాలనీలకు చెందిన యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై శ్రీ పవన్ కళ్యాణ్ మీద వున్న అభిమానంతో జనసేన పార్టీలో చేరిన యువకులను సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, యువజన సంఘం కమిటీ సభ్యులు, రామొజివార్, గంగా ప్రసాద్ కండువాలు కప్పి పార్టీ లో చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ పదవుల కోసం కాదు ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ 70 ఏండ్ల చరిత్ర కలిగిన అనేక రాజకీయ పార్టీల్లో కార్యకర్తలను భద్రత సౌకర్యం కల్పించలేదు. కాని జన సేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతి కార్యకర్తకు సభ్యత్వంలో 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఇప్పటి వరకు చాలా మంది కార్యకర్తలను ఆదుకున్న మహానేత ఇలాంటి పార్టీకి రైతులు, కార్మికులు, ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నాం. భవిష్యత్ లో మరిన్ని చేరికలను కొనసాగిస్తాం. బడుగు బలహీనర్గాలకు ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. పార్టీలో చేరిన యువకులు సాహెబ్ రావ్, చంద్రకాంత్, శ్రీను, లక్ష్మణ్, సంజు, దీపక్, తదితరులు పాల్గొన్నారు.