ఎస్పీకి ఘనమైన నివాళి “భారత రత్న”

ఎస్పీకి ఘనమైన నివాళి “భారత రత్న”

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.. 18 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పడిన బాలు మరణం అందరినీ కలచివేసింది.. ఇక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా బలపడుతోంది. తాజాగా సినీనటి జయప్రద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖరాశారు. ఎస్పీ బాలుకు “భారత రత్న” ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బాలుకు “భారత రత్న” పురస్కారం ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసిన జయప్రద. “భారత రత్న” పురస్కారం ప్రదానం చేయడం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘనమైన నివాళిగా లేఖలో పేర్కొన్నారు. సినీ సంగీతానికి, భారత చలన చిత్ర పరిశ్రమకు ఎస్పీ బాలు చేసిన ఎనలేని సేవలు అందించారిని లేఖలో వివరించారు జయప్రద.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోడీని కోరగా.. తాజాగా జయప్రద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖరాశారు.