పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: గాదె

అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాక సృష్టికర్త, అద్వితీయమైన తన మేధస్సుతో దేశానికి అపరిమితమైన సేవలందించిన మహామనిషి, గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్యకు ఆజాధికా అమృత్ మహోత్సవ జరుగుతున్న వేల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోరారు. పింగళి వెంకయ్య 146 వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమయంలో కాంగ్రెస్ నాయకులు బ్రిటీష్ జెండాను ఆవిష్కరించడం చూసిన పింగళి వెంకయ్య ఎంతో కలత చెందారని, మన దేశానికీ ఒక జాతీయ పతాకం ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎంతో కృషి చేసి జెండాకు రూపకల్పన చేశారన్నారు. మూడు రంగుల జాతీయ జెండా సమున్నతంగా ఎగురుతుంటే ప్రతీ భారతీయుడి శరీరం పులకరిస్తుందని, ఇది పింగళి వెంకయ్య దేశభక్తికి ఒక మచ్చుతునక అని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, నెల్లూరు రాజేష్, కొండేటి కిషోర్, లక్ష్మిశెట్టి నాని, పావులూరి కోటి, తిరుమలశెట్టి కిట్టూ, వడ్డె సుబ్బారావు, శిఖా బాలు, కొత్తకోట ప్రసాద్, పతెల్ల మల్లి, చేమిటికింటి కిరణ్, పెరుపోగు రాజు, సయ్యుద్ మంజూర్, కందుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.