విశ్వసనీయతే ఊపిరి

ప్రతి చోటా, అన్ని స్థాయిల్లో వ్యక్తికి వ్యవస్థలకి విశ్వసనీయతే ఊపిరి.. మిగతావి ఎన్ని ఉన్నా విశ్వసనీయత లోపం వాటన్నింటినీ హరించి వేస్తుంది.. విశ్వసనీయత ఒకసారి కోల్పోతే తిరిగి పొందటం కష్టం.. వ్యక్తులు లేకుండా వ్యవస్థలు ఉండవు.. ఆ వ్యవస్థల ప్రతిష్ట, పని తీరుతెన్నులు సమస్తం ఆయా వ్యక్తుల విశ్వసనీయత పైనే ఆధారపడి ఉంటుంది.. ఈ వాస్తవాన్ని విస్మరించిన వారు ఎంతటి వారైనా ప్రజల మనసులో పలుచన అవుతారు.. అప్రదిష్టపాలవుతారు.. ప్రజలతో రోజూ సంబంధాలు కలిగి ఉండే వారు తమ మాటల్లో, చేతల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.. కార్యాచరణలో చిత్తశుద్ధి వారి విశ్వసనీయతని పెంచుతుంది.

మొన్నటి 2019 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు టీడీపీ పార్టీ అధికారం కోల్పోయినది విశ్వసనీయత కోల్పోవడం వల్లే.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కూడా అదే దిశలో ప్రయాణం చేస్తోంది.. పాలనలో ఎంతటివారైనా కొన్ని తడబాట్లు పడటం, దానివల్ల నవ్వులపాలు కావడం అసహాజమేమీ కాదు.. ఐతే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడగలవారు ఎవరూ లేరు.. ఇక ముందు కూడా ఉండబోరు.. ఆయన ఎప్పటికప్పుడు తన రికార్డుని తానే ఆధిగమిస్తున్నారు.. అసలు పద్ధతి లేకపోవడమనేదే ఒక పద్ధతి.. వివాదాలు విధానాలు.. గిట్టని వారిని గేలి చేయడంలో దిట్ట.. ప్రత్యర్థుల్ని చులకనభావంతో నోరు పారేసుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారు.. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను కించపరచడం, చులకన భావం ప్రదర్శించడం, ప్రతిపక్ష జనసేన, మీడియా కధనాలన్నీ అభూత కల్పనలని బుకాయించడం లాంటివి నిత్యకృత్యంలో ఓ భాగం.. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా మాట మార్చి ఉండొచ్చు.. కానీ ఈ స్థాయిలో మాటలు మార్చడంలో పోటీపడినవారు, పడగలిగేవారు మాత్రం ఎవరూ లేరు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక్కటే.. ఇక చూడవల్సింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని.

గోపాలకృష్ణ
రాజేంద్రనగర్ నియోజకవర్గం