కనీస అవసరమైన గూడు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం: బొటుకు రమేష్ బాబు

దర్శి, జనసేన పార్టీ దర్శి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా జరుగుచున్న జగనన్న కాలనీల పరిశీలనా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా సోమవారం దర్శి నియోజకవర్గంలోని దర్శి నగర పంచాయితీకి మరియు దర్శి మండలంలోని ఇతర గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలను జనసేన పార్టీ నగర పంచాయత్ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య మరియు దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావుల ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు పుప్పాల రుద్రా పర్యవేక్షణలో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ జగనన్న కాలనీలను ఇప్పటికీ పూర్తిచేయకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియచేస్తుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటినా వారికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కేవలం అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టినట్లుగా ఉందన్నారు. ఎటువంటి సదుపాయాలు లేకుండా, అద్భుత కాలనీలు నిర్మిస్తామని ఉత్తర ప్రగల్బాలు పలికినట్లుగా ఉందన్నారు. కనీస అవసరమైన గూడును కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమన్నారు. రాజ్యాంగ మౌలిక ఆదేశ సూత్రాలను పాటించి అర్హులైన అందరికీ నివాస యోగ్యమైన ఇళ్లను యుద్ధ ప్రాతిపదికమీద కట్టించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో అన్ని జగనన్న కాలనీలలో లబ్ధిదారులు ఆశించిన పురోగతి జరగని పక్షంలో, జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తుందని రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దర్శి మండల కమిటీ ప్రధానకార్యదర్సులు ఉప్పు ఆంజనేయులు, మారాబత్తుని వెంకటయ్య, వీరమహిళా నాయకురాలు శ్రీమతి గుండ్ల భారతి, నాయకులు షేక్ వెంకటేష్, కత్తి నాగయ్య, యాదాల వెంకటేష్, రాగుల కొండలు, బెల్లం రమేష్, బెల్లం నంద, డొంతుల బాలకోటయ్య మారెళ్ల సింగరయ్య, పాలేపోగు వసంత్, మంచా కిషోర్, పుప్పాల శ్రీకాంత్, తప్పెట్ల వెంకట్, అబ్బు వంశీ పాల్గొన్నారు.