ఘనంగా రోసనూరు సోమశేఖర్ పుట్టిన రోజు వేడుకలు

సూళ్లూరుపేట నియోజకవర్గం: జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు తడ మండలం, చేనుగుంట గ్రామంలో ఉన్న అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా అనాధ ఆశ్రమంలో కేక్ ను కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేతలు, జనసైనికులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమము స్థానిక జనసేన నేతలు, జనసైనికులు నిర్వహించి విజయవంతం చేశారు.