రాజోలు మనోవికాస కేంద్రంలో గిడుగు సత్య బ్రహ్మాజీ పుట్టునరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం, జనసేన సీనియర్ నాయకులు మెరకపాలెం గ్రామ జనసేన అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ పుట్టినరోజు సందర్భంగా రాజోలు వివేకానంద వికలాంగుల మనోవికాస కేంద్రంలో అనాధ మానసిక వికలాంగులకు నిత్యావసర వస్తువులు మరియు తినుబండారాలు, శీతలపానీయాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, జనసేన వీరమహిళ శ్రీమతి ఉలిశెట్టి అన్నపూర్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.