తోట వీరబాబు సహకారంతో మజ్జిగ పంపిణీ

  • జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం 3వ రోజు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రలో 3వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం తోట వీరబాబు(బిక్కవోలు డాబా) చల్లని మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం యూత్ ప్రెసిడెంట్ గుత్తుల కొండబాబు, గ్రామ ఉపాధ్యక్షుడు నూతంగి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ నూతంగి ప్రసాద్, జనసేన నాయకులు వడ్లమూరి గోవిందరాజు, సతీష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.