రక్తదానమే ప్రాణధానం: కర్రోతు సత్యం

🔸మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం

🔸అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మరియు జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మరియు జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరానికి వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 ఎలక్ట్ గవర్నర్ కర్రోతు సత్యం హాజరై అయన మాట్లాడుతూ అన్నిదాణాల్లో కన్నా రక్తదానం మహాగొప్ప దానమని, సాటిమనిషి ప్రణాన్ని నిలబెట్టే ఈ రక్తదానం ప్రాణధానమని, కోట్లాది అభిమానులను సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి ధన్యజీవి అని అన్నారు.

మరో విశిష్ట అతిధిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు మాట్లాడుతూ ప్రేమే లక్ష్యం, సేవేమార్గం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్న, సేవకు ప్రతిరూపం, సినీపరిశ్రమకు పెద్ద దిక్కెయిన, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే మెగాభిమానులు ఇటువంటి రక్తదాన, నేత్రధానం వంటి పలుసేవలు చేయటం సమాజానికి ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.

వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 ఎలక్ట్ గవర్నర్, ప్రముఖ సంఘసేవకులు మరియు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పి.ఆర్.ఓ. ముడిదాపు రాము, టెక్నీషియన్ వి.సత్యరామ్ సేవలందించిన ఈ రక్తదాన కార్యక్రమంలో జనసేన పార్టీ యువనాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం కార్యదర్శి లోపింటి కళ్యాణ్, జనసేన నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు, యాతపేట రవి, సివికి సాయి, పావాడ వెంకి, బంకపల్లి జశ్వంత్ కూమార్, సివికి చంటి, నల్లపాటి సాయి ప్రకాష్, ఎస్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *