చిన్న యాదర అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన పార్టీ మరియు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బుధవారం అర్ధరాత్రి బందరు మండలం పెదయదర శివారు చిన్నయదర రామాలయం వద్ద దారపు రెడ్డి వెంకట సుబ్బమ్మ (62), రావి లక్ష్మి (68) లకు చెందిన రెండు నివాసగృహాలు పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం కలిగింది. 40,000 నగదు కాలిపోయింది. గురువారం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున లంకిశెట్టి బాలాజీ బాధిత కుటుంబాలకు బట్టలు, నిత్యావసర వస్తువులు, బియ్యం, వంట సామాగ్రి రెండు వేల రూపాయలు నగదును అందజేశారు. జనసేన పార్టీ తరఫున బందరు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ, పెదయాదర గ్రామ సర్పంచ్ గళ్ళ తిమోతి ఆధ్వర్యంలో జనసైనికులు గ్రామస్తులు 20 వేల రూపాయలు పోగుచేసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ చిన్నాపురం గ్రామంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 20 కిలోమీటర్లు బందరు నుండి ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు మిగిలేది ఏమీ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని బాలాజీ అన్నారు. సర్పంచ్ గల్లా తిమోతి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ ఈ విషాద సంఘటన జరగటం బాధాకరమని అన్నారు. జనసేన పార్టీ తరఫున తక్షణమే స్పందించి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ పది వేల రూపాయల నగదును ఇవ్వగా గ్రామంలో జనసైనికులు మరో పదివేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం వెంటనే చేయాల్సిన అవసరం ఉందని సర్పంచ్ తిమోతి అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జొన్నల వెంకట నాగరాజు, లంకిశెట్టి సాయి ఫణి సంతోష్, కొమరిపాలెం శ్రీనివాసు, పెద యాదర ఉపసర్పంచ్ భావిరెడ్డి పవన్, అడుసుమల్లి శ్రీనివాసరావు, దారపు రెడ్డి సూర్యచంద్రరావు, ఎం. నరేంద్ర, వర్రే రామాంజనేయులు, కంచెర్ల పల్లి మధుసూదన్ రావు, కంచెర్ల పల్లి సీతయ్య, జనసైనికులు పాల్గొన్నారు.