జనసేన రెండో విడత పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పెంటపాడు మండలం, మీనవల్లూలు గ్రామంలో ఆదివారం జనసేన రెండో విడత పల్లెపోరులో భాగంగా ప్రజలు డ్రైనేజీ అస్తవ్యస్తంపై బొలిశెట్టి కి వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ హయంలో ప్రభుత్వ దోపిడీలో ముందుందని ప్రజలకు సేవ చేయడంలో వెనక ఉందని బొలిశెట్టి ధ్వజమెత్తారు. మీనవల్లూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చూస్తుంటే ఇక్కడ ప్రజలు ముక్కు మూసుకొని జీవనం సాగిస్తున్నారని ఇటువంటివి కొట్టు సత్యనారాయణ కంటికి కనబడవని శ్రీనివాస్ ప్రజలకు వివరించారు. పెంటపాడు మండలం, అధ్యక్షులు పుల్లా బాబి మాట్లాడుతూ మన కొట్టు సత్యనారాయణకి సగటు మనిషి కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. మీ చెత్త పాలనలో చెత్తపై పన్నులు వేశారని, ఇసుక ధరలు అందుబాటులో లేకుండా చేశారని ప్రజలకు వివరించారు. అనంతరం తాడేపల్లిగూడెం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ నేడు మీనవల్లూరి గ్రామంలో ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా రోడ్లు డ్రైనేజీలు వాటర్ మీద చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందనీ ప్రజలందరూ కూడా నెత్తినూరు కొట్టుకునే పరిస్థితి మరి ఇటువంటి వైసీపీ వ్యక్తులు పాలించడం వల్ల చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిల్లి సత్యనారాయణ, కుక్కల శ్రీబాబు, గుబ్బల నాగరాజు, మాంతి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి స్థానిక తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం నుంచి సురప్పన్న శ్రీను, మట్ట రామకృష్ణ, అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.