చిరంజీవి యువత ఆద్వర్యంలో డాన్స్ పోటీలు

  • మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా డాన్స్ పోటీలు
  • విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో డాన్స్ పోటీలు
  • డాన్స్ మాస్టర్ రితిక్ జడ్జిగా నిర్వహణ

మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కనపాక, సాయి కాంప్లెక్స్ లో ఉన్న రితిక్ డాన్స్ స్టూడియో లో మెగా డాన్స్ పోటీలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) నిర్వహించడం జరిగింది.

కేవలం చిరంజీవి నటించిన సినిమా పాటలకు డాన్స్ పోటీలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖలచే ప్రశంసలు, అవార్డ్స్ పొందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ రితిక్ జడ్జి గా వ్యవహారించారు. పోటీల్లో సోలో, గ్రూప్ డాన్స్ విభాగల్లో విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు బాలు మాట్లాడుతూ అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు, మా గురువుగారు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించుకొనుటకు డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామని,మా ఆరాధ్య దైవం చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే ధ్యేయమని అన్నారు.

పోటీల్లో పాల్గున్న ప్రతీ ఒక్కరికీ బహుమతులు ఇచ్చిన కార్యక్రమంలో ప్రధమ బహుమతి చిరంజీవి. యుమున, ద్వితీయ బహుమతిని చిరంజీవి. రచన, తృతీయ బహుమతిని చిరంజీవి. కోమలి గెలుచుకోగా, ఈ బహుమతులను డాన్స్ మాస్టర్ రితిక్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు చేతులమీదుగా విద్యార్థినీవిద్యార్థులకు పంచిపెట్టడం జరిగింది.

అనంతరం డాన్స్ పోటీలకు జడ్జి గా వ్యవహరించిన డాన్స్ మాస్టర్ రితిక్ ను మెగాభిమానులంతా సత్కరించారు.

కార్యక్రమంలో రితిక్ డాన్స్ స్టూడియో మాస్టర్లు రామ్, శివ,జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చిరంజీవి యువత ప్రతినిధి ఎస్. మురళీమోహన్, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, అడబాల వెంకటేష్, గౌరి నాయుడు, సాయి, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *