ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లిలో గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి పవనన్న ప్రజాబాట” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సత్తెనపల్లి పట్టణం 5వ వార్డులో పర్యటించడం జరిగింది. “హిందూ-ముస్లీం భాయ్ భాయ్” అన్న నినాదానికి ప్రతిరూపంగా ఉండే ఈ వార్డులో మతసామరస్యం వెల్లివిరియడం అభినందనీయం. ఈ వార్డులో జనసేన పార్టీకి ఊహించిన దానికంటే అపురూపమైన ఆదరణ లభించడం గమనార్హం. ఆద్యంతం బొర్రా నేతృత్వంలో సాగిన పర్యటన స్థానికులు పూల వర్షంతో ముంచెత్తి, శాలువాలతో, పూలదండలతో బొర్రా అప్పారావుని సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను జనసేన పార్టీ ధృష్ఠికి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా డ్రైనేజీ సమస్య, పారిశుధ్ధ్య సమస్య, లో-ఓల్టేజి సమస్య మరియు చెరువు పోరంబోకులో ఉండే పేదల పట్టాలను రెగ్యులరైజ్ చేసి వారికి రోడ్లు, విధ్యుత్ సౌకర్యం కల్పించాలని ఏకరువు పెట్టారు. పర్యటనలో భాగంగా ప్రమాదవశాత్తూ గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న సైదా అనే కార్మికుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధికంగా సహకారం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావుతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధానకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి అంపిరాయని రాజేశ్వరి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, పట్టణ 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, మండల పార్టీ అధ్యక్షులు తోట నర్సయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, తాడువాయి లక్ష్మీ, శిరిగిరి పవన్ కుమార్, నాయకులు దార్ల శ్రీనివాస్, అంపిరాయని రాజశేఖర్, షేక్ బాజీ, రామిశెట్టి శ్రీనివాసరావు, నామాల పుష్పలత, సిసింద్రీ, మహంకాళి, చేబ్రోలు రవి కిరణ్, కొమ్మిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముప్పాళ్ళ మండలం రుద్రవరం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు అయినటువంటి కొమర సుబ్బారావు తండ్రి కొమర కోటేశ్వరరావు అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించినారు. వారిని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆదివారం వారి గృహమునందు కలిసి వారి యొక్క సానుభూతిని తెలిపి భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ తరఫున తాను అండగా ఉంటానని వారికి ధైర్యం కల్పించి వారికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రూరల్ మండలాధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, సత్తెనపల్లి కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ఎస్సీ నాయకులు చిలకపూర్ణ, మైనార్టీ సెల్ నాయకులు షేక్ జాన్ బీర, ముప్పాళ్ళ మండల కార్యదర్శి షేక్ మదర్ మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సత్తెనపల్లి టౌన్ లో జరుగుతున్న ఇంటింటికి పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిస్వార్థ జనసైనికుడిని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా అప్పారావు పరామర్శించి, ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, దార్ల శ్రీను, అంపిరియాని రాజేశ్వరి, బత్తుల కేశవ, నామాల పుష్ప పట్టణ జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.