బీసీ వసతి గృహాల దుస్థితిపై మండిపడిన ఉయ్యాల ప్రవీణ్

  • సూళ్లూరుపేటలో బీసీ వసతి గృహాన్ని సందర్శించిన ఉయ్యాల ప్రవీణ్

సూళ్లూరుపేట నియోజకవర్గం: సూళ్లూరుపేటలో బీసీ వసతి గృహాల దుస్థితిపై జనసేన పార్టీ సూళ్లూరుపేట ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మండిపడ్డారు. ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో బీసీ బాలుర, బీసీ బాలికల వసతి భవనాలను ఉయ్యాల ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అన్నీ ఘనంగా జరుగుతాయి. ఒక సంస్థాగతగా అభివృద్ధి తప్ప. కట్టలేని పోలవరానికి 4 సార్లు కోట్లు ఖర్చుపెట్టి శంకుస్థాపనలు. బోరింగు పంపులకు లక్షల రూపాయలు పెట్టి శంకుస్థాపనలు. 5 కిలోమీటర్లు దూరానికి 5 లక్షల పెట్టీ హెలికాప్టర్లు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బాలుల, బాలికల వసతి భవనాల గురించి ఎవరికీ పట్టదు.. సూళ్లూరుపేటలో బీసీ బాలికలకు మాత్రం ఒక భవనం నిర్మించలేరు. 111 మంది బీ.సీ బాలికలకు 2 గదులు మాత్రమే. తలుపులు లేని స్నానపు గదులు. పెచ్చులు ఊడిపోయే ఇంటి పైకప్పులు.పొద్దున లేచినప్పటినుంచి పడుకునే వరకూ అన్నీ అదే గదులలోనే. మాట్లాడితే మా అధ్యక్షులు మీద అనుచిత వ్యాఖ్యలు చేసే మహిళా మంత్రులు, వైసిపి నాయకురాలు ఇవి చూసి వీటికి సమాధానం చెప్పాలి. బాలికలకు అన్నివిధాలుగా న్యాయం జరిగేవరకు, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని ఉయ్యాల ప్రవీణ్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు రమణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు రమణ, వల్లూరు కిరణ్ వైస్ ప్రెసిడెంట్, శ్రీహరికోట జగదీష్ వైస్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ మండల కార్యదర్శి రమణ, జనసైనికులు బాలు, కళ్యాణ్, బద్రి, హరి, సుబు సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.