టిడిపి దీక్షా శిబిరాన్ని సందర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయని, ఇలాంటి తరుణంలోనే స్వల్ప విభేదాలు, అంతరాలను ప్రక్కన పెట్టి ఐకమత్యంగా పోరాటాలు నడపాలని సత్తెనపల్లి జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు అన్నారు. చంద్రబాబునాయుడి అరెస్టును ఖండిస్తూ ఆయనకి మద్దతుగా, సంఘీభావంగా స్థానిక సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్-చార్జి కన్నా లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరానికి గురువారం జనసేన శ్రేణులు వెళ్ళి తమ సంఘీభావాన్ని తెలుపారు. బొర్రా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాలుగు మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్ తదితర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తమ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెల్పిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం జరిగిన రెండు గంటలకే జనసేన అధినేత రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని పరామర్శించి, అనంతరం బాలక్రిష్ణ, లోకేష్ లతో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ఇరుపార్టీల పొత్తును అధికారికంగా ఖరారు చేశారు. ఇరుపార్టీల అధినేతలు కలిసి చెప్పవలసిన కీలక అంశాన్ని చంద్రబాబు జైల్లో ఉండడంతో ఇరుపార్టీల భాద్యతలను భుజానికెత్తుకున్న జనసేనాని ఈ కీలక నిర్ణయాన్ని ఒంటరిగా ప్రకటించారు. దీంతో సత్తెనపల్లి దీక్షా శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో గన్నమనేని శ్రీనివాసరాబు, రంగిశెట్టి సుమన్, కంబాల వెంకటేశ్వరరావు, శిరిగిరి సుమన్ కుమార్, పచ్చా నాగేశ్వరరావు, తోట నర్సయ్య, పూజల వెంకట కోటయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, కోమటినేని శ్రీనివాసరావు, తాడువాయి లక్ష్మీ, బత్తుల నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు ఇరుపార్టీల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.