బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం మరోమారు విజయవంతమైంది. ఈసారి బ్రహ్మోస్ క్షిపణిని భారత నేవీకి చెందిన స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) వెల్లడించింది.