లక్కవరపు కోట జనసేన ఆత్మీయ సమావేశం

లక్కవరపు కోట మండలంలో సోమవారం మండల నాయకులు రామెళ్ళ శివాజీ, రావాడ నాయుడు, షేక్ ఫిరోజ్, అలమండ రాంబాబు, పిల్లా సురేష్ అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ముందు ముందు పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి గ్రామ స్థాయిలో ఎలా పార్టీని బలోపేతం చేయాలి అన్న విషయాలు మీద ఈ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ నాయకులు గొరపల్లి రవికుమార్, వేపాడ మండల అధ్యక్షులు సుంకరి అప్పారావు, పార్లమెంట్ కమిటీ ఎక్సక్యూటివ్ మెంబర్ జొన్నపల్లి సత్తిబాబు, కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరాజు సతీష్, పార్లమెంట్ ఎక్సక్యూటివ్ మెంబర్ మల్లువలస శ్రీను, వెంకటేష్, గాలి అప్పారావు, పిల్లా రామదుర్గ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.