వీరఘట్టంలో టీమ్ పిడికిలి పోస్టర్స్ తో ప్రచారం

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వీరఘట్టంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ఆటోలకి టీమ్ పిడికిలి పోస్టర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యుద్ధం మీరు మొదలు పెట్టారు – మేము ఇక ముగిస్తాం ఇక ఎక్కడ తగ్గేది లేదు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. మత్స పుండరికం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంతవరకు తగ్గుతూ మా అధినేత వచ్చారు కానీ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక అవతలి వాళ్ళు తగ్గాలి జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయుకులు కర్నెన, సాయి పవన్ వావిలపల్లి భూషణ్ రావు, దత్తి గోపాల్, నీలాం తిరుపతి రావు బీజేపీ మండల నాయుకులు దేవకీవాడ లక్ష్మణ్ రావు, సిర్లాపు చిన్నారావు పాల్గొన్నారు.