కెనడా జనసైనికుల ఆత్మీయ సమావేశం

కెనడా, జనసేన కెనడా టీం జనసైనికులు శనివారం వాంకోవర్ లో సిటిలో గల బేర్ క్రీక్ పార్క్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. వాంకోవర్ నగరంలో ఇది మొదటి సమావేశం. ఎన్నారై కమ్యూనిటీగా వారు జనసేన బలోపేతం చేసే వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. కెనడాలో సోషల్ మీడియా ప్రచారాలు, డేటా సేకరణ, ఓటరు నమోదు మరియు సమూహ కార్యకలాపాలు వంటి సహాయక కార్యకలాపాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన తెనాలి ఐటీ కో-ఆర్డినేటర్ జనార్దన్ గోన, బాల గుద్డేటి ఐటీ వాలంటీర్, సారథి, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.