గిరిజనులకు కేటాయించిన స్మశానంపై వైకాపా నాయకుల కన్ను

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండల మేజిస్ట్రేట్ అయిన గౌరవనీయులు ఉషా కి మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ విన్నపం వైసిపి నాయకులు గతంలో, ప్రస్తుతం అనేక ఆక్రమణలు చేస్తూ ఏకంగా అసైన్మెంట్ భూములనే వెంచరేసి ప్లాట్లు ఒక్కొక్కటిగా అమ్ముకునేది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వైకాపా నాయకులు ఏకంగా స్మశానాలను కూడా వదలడం లేదు. సింగరాయకొండ మల్లిఖార్జున్ నగర్ కు చెందిన ఎస్టీ యానాదుల కులానికి కేటాయించిన స్మశాన వాటికను ఆక్రమణకు గురి చేసినారు. దీనిపై గతంలో సింగరాయకొండ తాసిల్దారుగా విధులు నిర్వహించిన గౌరవనీయులు ఉషారాణి సమక్షంలో నాడు నేడు ఆక్రమణలకు పాల్పడిన వైకాపా నాయకుడిని మందలించడం జరిగినది. అయినప్పటికీ ఆ నాయకుడే మృతదేహాన్ని కాల్తో తన్ని గిరిజనులను దుర్భాషలాడుతూ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరాయకొండలో ఎన్నో చూస్తున్నాం. మండల మేజిస్ట్రేట్ అయిన తమకు జరిగిన విషయం మొత్తం తెలిసిందే. గిరిజనుల స్మశానానికి కేటాయించిన ఆ ప్రభుత్వ భూమిని నామమాత్రంగానే యానాదులకు అప్పజెప్పారా లేక శాశ్వత పరిష్కారాన్ని చూపారా. మండల జనసేన పార్టీ తరఫున వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడకుండా గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మశానవాటికను కూడా వదలకుండా ఆక్రమణలకు గురిచేస్తున్న వైకాపా నాయకులను వ్యతిరేకిస్తూ గిరిజనులకు శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూపుతారో తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సంకే నాగరాజు, అనుమల శెట్టి కిరణ్ బాబు, గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, శీలం సాయి, సయ్యద్ సుభాని, నామా మహేష్, వాయిల అనిల్ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.