దాతలే నిజమైన దేవుళ్ళు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామం, చెగువేరా పుట్టినరోజు సందర్బంగా అన్ని దేశాలు ప్రజలు యువత ఎంతో ఆనందం పొందే రోజు ఎందుకు అంటే చాలా పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి చేగువేరా కొన్ని దేశాలు ప్రజలను పాలకలు నరకయాతన పెడుతుంటే వారికోసం నేనున్నాను అంటు అండగా నిలబడ్డారు. చివరకు ప్రజలకోసం చనిపోయారు అలాగే ఈరోజు నేషనల్ బ్లడ్ బ్యాంకు డే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ కొణిదల చిరంజీవి బ్లడ్ బ్యాంకు పెట్టి ఎంతో మందికి రక్తాదానంచేసి ప్రజలను ఆదుకున్నారు. అలానే ఎంతో మంది ప్రజలు ఎన్నో సందర్బంలో రక్త దానం చేసి వారియొక్క మంచి మనసుని చాటుకున్నారు. ఈ సృష్టిలో.. నా దృష్టిలో.. రక్త దాతలు నవజీవన పూర్తి దాతలు రక్త దాతలే నిజమైన దేవుళ్ళు అని జనసేన జానీ అన్నారు.