కర్పూరి ఠాకూర్ కు శత జయంతి నివాళులు

తాడేపల్లిగూడెం: స్వాతంత్ర సమరయోధులు బీహార్ ప్రజల అంబేద్కర్ భారతరత్న శ్రీ కర్పూరి ఠాకూర్ శత జయంతి నివాళులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య గుఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువజన అధ్యక్షులు అత్తిలి బాబి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ మండల రిజర్వేషన్ 26% అమలు చేసిన మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి కర్పూరి మహిళలకు కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన తొట్ట తొలి ముఖ్యమంత్రి శ్రీ కర్పూర ఠాగూర్ అని అన్నారు స్వాతంత్రం కోసం విద్యను కూడా ఆపేసి జైలు జీవితం గడిపిన నిజమైన స్వాతంత్ర సమరయోధుడు అని ఈ దేశంలో నూటికి 85 శాతం ఉన్న బహుజనులు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లాలని జీవితాంతం పోరాడిన సామాజిక వ్యక్త కర్పూరి ఠాకూర్ అని ఆయన శత జయంతి జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసారు.