ప్రణీత్ రెడ్డి పద్దతి మార్చుకో: మలగా రమేష్

  • మున్సిపల్ ఆస్తులను కాజేయాలని చూస్తే ఊరుకోం
  • 38వ డివిజన్లో ప్రహరీ గోడ పనుల అడ్డగింత సరికాదు
  • మున్సిపల్ యంత్రాంగం నిద్ర మత్తు వీడాలి
  • పనులు పునః ప్రారంభం కాకుంటే బాలినేని ఇంటి ముందు ధర్నా చేస్తాం
  • 38వ డివిజన్ జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ హెచ్చరిక

ఒంగోలు: బాలినేని ప్రణీత్ రెడ్డి.. నీ పద్దతి మార్చుకో, మున్సిపల్ స్థలాలు కబ్జా చేయాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని జనసేన నగర అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ హెచ్చరించారు. ఆదివారం మీడియా ముఖంగా మలగా పలు విషయాలు మాట్లాడారు. ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆగడాలు తిమీరిపోయాయన్నారు. ఆయన తీరు వలన నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ ఆస్తులను కూడా వదలం లేదని ఆరోపించారు. తమ డివిజన్ 38లో ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ వెంచర్లోని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాన్ని ఆయన చెర నుండి కాపాడాలని కోరారు. సుమారు 1970 వేసిన ఈ వెంచర్లో మున్సిపాలటీకి సంబంధించిన స్థలం సర్వే నం.118/1 ఎల్. పి నెంబర్ 100/78 లో ఉంది. గత 10 రోజుల క్రిందట ఆ స్థలం చుట్ట ప్రహరీ గోడ కట్టాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కొలతలు వేసి, దానికి సంబంధించి రూ 10 లక్షలు కూడా నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ప్రహరీ గోడ పనులు కూడా మొదలు పెట్టారు. కాని గత మూడు రోజుల నుండి ప్రహరీ పనులను నిలిపివేశారు. హఠాత్తుగా ఎందుకు నిలిపి వేశారో ఎవ్వరికి తెలియదు. అడిగినా సక్రమైన సమాధానం వారి వద్ద నుండి లభించడం లేదు. దీంతో ఆ స్థలాన్ని ఇలానే ఖాళీగా వదిలి వేస్తే కబ్జాకు గురౌతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పనులను ప్రణీత్ రెడ్డి ఆపించారని బహిరంగ రహస్యంగా మారిందన్నారు. ఆపడం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని చర్చ నడుస్తోంది. మళ్లీ పనులు పున: ప్రారంభం కాకుంటే బాలినేని ఇంటి వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇలానే ఒంగోలు నగరంలో మున్సిపాలటికి సంబంధించిన స్థలాలు సుమారు 80కి పైగానే లే అవుట్లు ఉన్నాయి. వాటిలో కొన్నిటి సంరక్షణను మాత్రం మున్సిపాలటీ గాలికొదిలేసింది. ఈ క్రమంలో మున్సిపల్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం నిద్ర మత్తు వీడి మున్సిపల్ ఆస్తులను కాడాలని కోరారు. అదే విధంగా 38వ డివిజనల్లో నిలిచి పోయిన ప్రహరీ గోడ నిర్మాణ పనులు పున:ప్రారంభించాలని మలగా రమేష్ డిమాండ్ చేశారు. లేదంటే జనసేన పక్షాన మున్సిపల్ అధికారుల తీరుపై ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.