రాష్ట్ర ప్రజలను, రైతులను మూడు రాజధానులు అంటూ మోసం చేస్తున్న ముఖ్యమంత్రి: పసుపులేటి హరిప్రసాద్

తిరుపతిలో నిర్వహించిన అమరావతి రైతుల మహాసభలో జనసేన పార్టీ నాయకులు పిఏసి సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే మాటకు ఆరోజు కట్టుబడి ఉన్నారు ఈ రోజు కట్టుబడి ఉన్నారు. ఆయన రైతుల పక్షపాతి, గత ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాకుంటున్న సమయంలో రైతులు ఇస్తే తీసుకోవాలేతప్ప బలవంతపు చర్యలకు పాల్పడవద్దు అని ఆరోజు తీవ్రంగా ఖండించారు, అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను రైతులను మూడు రాజధానులు అంటూ మోసం చేస్తున్నారు అని దీనికి పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకమని అమరావతి రైతులకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ తరపున మా నాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి జనసేన తరపున మా పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది అని అన్నారు.

రాందాస్ చౌదరి మాట్లాడుతూ… అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సందేశం పంపారని జనసేన ప్రతినిధిగా అమరావతి సభకు మేము హాజరయ్యాము అని, అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్‌ అన్నారని తెలిపారు, రైతుల పక్షాన జనసేన ఉంటుందని స్పష్టం చేశారు, రైతుల పాదయాత్ర జనం మదిలో నిలిచిపోతుందన్నారు.