జనసేనలో చేరిన మసిపుట్టు గ్రామయువత

అల్లూరి జిల్లా పాడేరు మండలం డోకులూరు పంచాయితీ మసిపుట్టు గ్రామంలో జనసేన మండల అధ్యక్షులు, నందోలి మురళి కృష్ణ, పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్, పాంగి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజలతో జనసేన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ నాయకులు డా.వంపురు గంగులయ్య హాజరై పలు గ్రామాలను పర్యటించి గ్రామస్తులతో వారి సమస్యలు ఆడిగితెలుసుకున్నారు. వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో పెద్దఎత్తున మసిపుట్టు గ్రామయువత, గ్రామస్తులు జనసేన పార్టీలో చేరారు వారికి సాదరంగా కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అలాగే ప్రధానంగా తాగునీటి, రోడ్డు సమస్యలు పరిష్కరించాలని డా.వంపురు గంగులయ్యని కోరారు. మండల కేంద్రానికి చాలా దగ్గరగా ఉన్న గ్రామాలు, మసిపుట్టు, మండిపుట్టు, డోకులూరు గ్రామాలను పర్యటించి అక్కడి ప్రజలతో పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని డ్వాక్రా మహిళలకి రావాల్సిన నిధులు, పెన్షన్లు, రేషన్ కార్డ్స్ అక్రమ తొలగింపు, పీజు రియంబర్మెంట్స్ వంటి వాటి పైన దోపిడీని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందనీ అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే ఏ అధికారంలో లేకున్నా తన సొంత సంపాదనతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు తనవంతుగా 30కోట్ల సహాయనిధి ప్రకటించారు పవన్ కళ్యాణ్. పాలకవర్గాల్లో ఒక రకమైన భయం మొదలైందని అందుకే దిక్కులేక పవన్ మీద బురద జల్లడమే పనిగట్టుకుని చేస్తున్నారని ప్రజలు మార్పు కొరకు ఈ వారసత్వ రాజకీయాలను త్యజించాలని లేకుంటే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని కాంక్షించలేమని తెలిపారు. సరైన విద్య, వైద్య సేవలు నేటికి గిరిజనుల్లో అందుబాటులో లేవని వైసీపీ ప్రజాప్రతినిధులు 5ఏళ్లకు ఒకసారి మాత్రమే ముఖం చూపిస్తారని స్థానిక సమస్యల నిర్మూలన, అభివృద్ధి అనే అంశాలు వాళ్ళకి ఎన్నికల ముందు మాత్రమే గుర్తుకొస్తాయని ఇలాంటి రెండు నాల్కల ధోరణి కలిగిన నాయకులు మన ప్రాంతంలో ఎక్కువైపోయారని తస్మాత్ వారితో జాగ్రత్తగా ఉండాలని, వారు చిదిమెసేది కేవలం గిరిజనుల అభివృద్ధిని మాత్రమే కాదని, భావితరాల బవిష్యత్ ని కూడా అని తెలుసుకోవాలని ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవలని హితవు పలికారు. ఏ గ్రామానికి వెళ్లిన సమస్యలు 99% అనుకుంటే అభివృద్ధి 1% మాత్రమే ఉందని జాబ్ కాలెండర్లు అంటూ ఊకదంపుడు ప్రచారాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని ఎన్నికలతో ముడిపెడుతోందని బోడి గుండు కి మోకాలికి ముడిపెట్టేవిదంగా ఆలోచన చేస్తున్నారని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ముక్యంగా యువత తమవంతు చైతన్యవంతమైన రాజకీయలవైపు అమాయక గిరిజన ప్రజల్లో మార్పు కొరకు విస్తృతంగా ప్రచారం చెయ్యాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ ప్రజలతో జనసేన కార్యక్రమంలో మండల నాయకులు నందోలి మురళీకృష్ణ, ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సత్యనారయణ మజ్జి, సంతోష్ మజ్జి, సురేష్ పాంగి మరియు, గ్రామస్తులు నాగేష్ రావు, మల్లేష్, బంధు, పలువురు జనసైనికులు, మండిపుట్టు మహిళలు, డోకులూరు యువత పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని డా.వంపురు గంగులయ్య తెలిపారు.