చింతపల్లి జనసేన మండల అధ్యక్షుల ప్రమాణస్వీకారం

పాడేరు: గూడెం, చింతపల్లి మండలాల స్థానిక గూడెం మండల జనసేన పార్టీ నాయకులతో పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన జనసైనికులకు, నియోజకవర్గ మండల అధ్యక్షులకు పిలుపునిస్తూ నూతనంగా జనసేన పార్టీ వివిధ మండల అధ్యక్షులుగా నియమితులైన నాయకులు విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, కార్యదక్షత, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే పాడేరు పట్టణంలో బైక్ ర్యాలీ ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకరణ సభకు నియోజకవర్గం వారిగా జనసైనికులు, నాయకులు వీరమహిళలు అశేషంగా తరలిరావాలని పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాడేరు, గూడెం, జి.మాడుగుల, చింతపల్లి మండలాల అధ్యక్షులు, మసాడి భీమన్న, వంతల బుజ్జిబాబు, కొయ్యం బాలరాజు, సాలేబు అశోక్, వంతల రాజారావు, సిద్ధు, ఈశ్వర్, కోటేశ్వరరావు, పరమేశ్వర్రావు, తదితర జనసైనికులు పాల్గొన్నారు.