టిట్కో ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరుతూ జనసేన నిరాహార దీక్ష

  • టిట్కో ఇళ్ళపై ఎమ్మెల్యే మోసకారి మాటల్ని నిరసిస్తూ, వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సోమవారం నిరాహార దీక్ష
  • టిట్కో ఇళ్ళ లబ్దిదారులు అందరూ పాల్గొని జయప్రదం చేయండి – జనసేన పిలుపు

నూజివీడు నియోజకవర్గం: టిట్కో ఇళ్ళపై ఎమ్మెల్యే మోసకారి మాటల్ని నిరసిస్తూ.. ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ తెలిపారు. శనివారం ద్వారక థియేటర్ ఎదురుగా ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన సోమవారం నిరాహార దీక్ష చేస్తుంది అనగానే ఎమ్మెల్యేకి, వైఎస్ఆర్సిపి నాయకులు లబ్ధిదారులు మోసగించడానికి త్వరలోనే ఇల్లు పంపిణీ చేస్తున్నామని ప్రకటన రిలీజ్ చేయడం లబ్ధిదారులను మళ్ళీ మోసం చేయడమే అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా గుర్తురాని లబ్ధిదారులు జనసేన నిరాహార దీక్ష అనగానే ఎందుకు గుర్తు వచ్చారని, ఎన్నికలు దగ్గరకు వచ్చాయని గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. నూజివీడు టౌన్ పార్టీ నాయకులు ముత్యాల కామేష్ మాట్లాడుతూ పేదలు అందరికీ ఇల్లు ఉండాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీం కింద పట్టణ పేదలకు జి ప్లస్ త్రీ ఇల్లు నిర్మాణం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగిందనీ, దేనికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే ప్రతాప్ మరణశాసనం రాశారని అన్నారు. బండారు రాజు మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో సుమారు మూడువేల జి ప్లస్ త్రీ ఇళ్లను టిట్కో సంస్థ నిర్మాణం చేపట్టిందనీ తెలిపారు. ముమ్మలనేని సునీల్ కుమార్ మాట్లాడుతూ 80% పనులు పూర్తయి మిగిలిన 20% పనులు పూర్తి చేయవలసిన సమయంలో ఎన్నికలు రావటం ప్రభుత్వాలు మారడం వల్ల గత నాలుగున్నర సంవత్సరాలగా టిట్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనీ తట్టెడు మట్టి వేయలేదని ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి డ్రామా మాటలు మాట్లాడుతున్నారని లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ నుండి నోటీసీలు పంపిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చేతకానితనానికి పరాకాష్ట పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మరణ శాసనం రాస్తున్నారు అని అన్నారు. జనసేన వీరమహిళ నాయకురాలు రంగు ధనలక్ష్మి మాట్లాడుతూ.. టిట్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని గత నాలుగున్నర సంవత్సర కాలంగా నూజివీడు పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో నూజివీడు మున్సిపల్ కమిషనర్ గారికి, నూజివీడు ఆర్డిఓకి, నూజివీడు సబ్ కలెక్టర్కి దాదాపు 20 సార్లకు పైగా స్పందనలో కంప్లైంట్లు చేసిన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఉండటం, లబ్ధిదారులకు గృహాలు నేటికీ అందించకపోవడని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12 -2-24 (సోమవారం) ఉదయం 10 గంటలకు నూజివీడు మున్సిపల్ కార్యాలయం వద్ద టిట్కో లబ్ధిదారులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ సానుభూతిపరులతో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో నూజివీడు మండల కార్యదర్శి షేక్. నాగూర్, రావిచెర్ల గ్రామ జనసైనికుడు తోట బలరాం, కస్తూరి. అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.