నరసింహారావుపాలెం గ్రామంలో పల్లె పధాన జనసేన

నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరితో పాటు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పరామర్శించారు. మల్లికార్జున కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాయంత్రం నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలం, నరసింహారావుపాలెం గ్రామంలో పల్లె పధాన జనసేన కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో తోట మూల నుండి జనసైనికులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. జై – జనసేన అంటూ జనసైనికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నడుమ నినాదలతో హోరేత్తించారు. రమాదేవికి హారతులు పట్టారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజల అనేక సమస్యలు రమాదేవి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నరసింహారావు పాలెం జనసైనికుల ఉత్సాహం చూస్తుంటే తానెప్పుడూ మరచిపోలేనని అన్నారు. తదుపరి స్థానిక సమస్యలపైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్ధిక ఇబ్బందులు ఎదురకొంటున్న, పూల మల్లేశ్వరావు, రేగళ్ళ రోషమ్మ, మంగళపూడి లాజర్, ఇసుకపల్లి ఎలసమ్మ, మంగళపూడి జయరాజు, కుటుంబాలకి 5000 చొప్పున ఐదు కుటుంబలకు 25000 వేలు ఆర్ధిక సాయాన్ని రమాదేవి ద్వారా అందించారు. జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ చేస్తున్న కుట్రలకు ఎటువంటి సందేహాలు ఉన్న స్వయంగా తమని అడిగి తెలుసుకోమన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్నాయని ఈ రాక్షస పాలన కు ఓటు అనే ఆయుధంతో చరమగీతం పాడాలని రమాదేవి నరసింహారావు పాలెం గ్రామ జనసైనికులకు పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయత కేవలం జనసేన పార్టీలో మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, నందిగామ మండల అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, వీరులపాడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోయన వెంకటస్వామి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బోయన శ్రీనివాస్, నందిగామ పట్టణ ప్రధాన కార్యదర్శి తెప్పలి కోటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు సూర సత్యన్నారాయణ, పురంశెట్టి నాగేంద్ర, స్రవంతి, రాజీవ్, వివిధ గ్రామాల జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.