పర్చూరులో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

పర్చూరు: పర్చూరులో డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ముందుగా 1000 తమలపాకుల పూజ నిర్వహించిన అభిమానులు, తదుపరి సీనియర్ నాయకులు భొగది రవిచంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బాధ్యులు పెదపూడి విజయ్ ముఖ్య అతిథిగా కేక్ కటింగు మరియు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిరంజీవి, మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, స్టానిక నాయకులు గిరి శ్రీనివాసరావు, ఆదిపూడి రంగయ్య, విశిష్ట అథితి చిలకలూరిపేట నాయకులు తోట రాజరమేశ్ మరియు మెగభిమనులు పాల్గొని విజయవంతం చేసారు.