చిరంజీవి జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయక గ్రంధం

  • చిరంజీవికి భారతరత్న రావాలని ప్రతీ తెలుగు హృదయం పరితపిస్తుంది

గుంటూరు: సినీపరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో అత్యున్నతస్థాయికి చేరుకున్న చిరంజీవి జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయక గ్రంధమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ప్రముఖ సినీనటులు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించడంపై ఆదివారం శ్రీనివాసరావుతోటలో కేక్ కట్ చేసి , బాణాసంచా కాలుస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తిని ఖండంతరాలు దాటించిన నటుడు చిరంజీవని అన్నారు. చిరంజీవికి భారతరత్న రావాలని ఆ క్షణాల కోసం ప్రతీ తెలుగువాని హృదయం పరితపిస్తుందని ఆళ్ళ హరి అన్నారు. పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ చిరంజీవి ఏది అనుకున్నా సాధించే వరకు నిష్క్రమించని యోధుడని కొనియాడారు. చిరంజీవి కొన్ని తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు కొర్రపాటి నాగేశ్వరరావు తెలిపారు. జనసేన ఆంధ్ర విభాగ కో కన్వీనర్ వీరిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ తాను కష్టపడి సంపాదించుకున్న అవార్డును అభిమానులకు అంకితం చేయటం ఎంతో ముదావహం అన్నారు. కోట్లాదిమంది అభిమానుల్ని సేవా మార్గం వైపు నడిపిన ఓ మహోన్నత శిఖరం చిరంజీవని అన్నారు. నటనలోనే కాకుండా సంఘసేవలోనూ, గుప్త దానాల్లోనూ చిరంజీవిని మించిన వారు లేరని వీరిశెట్టి సుబ్బారావు కొనియాడారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, సయ్యద్ షర్ఫుద్దీన్, షేక్ నాగూర్, రామిశెట్టి శ్రీనివాస్, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, కోలా మల్లి, స్టూడియో బాలాజీ, సుభాని, శెట్టి శ్రీను, అలా కాసులు, ఇల్లా శేషు, గోవింద్, ఇల్లా చిరంజీవి, నరసింహ, సుందరరావు, బద్రిశెట్టి రాంబాబు, అబోతు నాగేశ్వరరావు, ఫణి, తోట సాంబశివరావు, వీరిశెట్టి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.