వంగవీటి మోహన రంగా చిరస్మరణీయుడు: ఎస్ వి బాబు

వంగవీటి మోహన రంగా ఈ పేరు వింటే చాలు కాపు, బడుగు, బలహీన వర్గాలు, బహుజనులు, పేదలు రెండు చేతులు జోడించి ఆరాధన భావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు

మడమ తిప్పని పౌరుషంతో ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం గాంధీయ మార్గంలో అమర నిరాహార దీక్ష ఉద్యమం చేస్తూ 1988 డిసెంబర్ 26న రాజకీయ కుట్రకు బలైపోయారు.

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా మరణించే నాటికి ఆయన వయసు 41 సంవత్సరాలు
ఎంతకాలం జీవించావు అన్నది ముఖ్యం కాదు.. ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నది ముఖ్యం.

మరణించి 34 సంవత్సరాలు అయినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా చిరస్మరణీయుడు.

1947 వ సంవత్సరం జులై మాసం మరో మండలం కాలంలో భారతదేశం తెల్ల వారి పాలన ఉండి విముక్తి కోసం సిద్ధమవుతున్న సమయం ఎక్కడ చూసినా ఆశ ఎవరి మొహంలో పలకరించిన విముక్తి కోసం అంతులేని ఆనందం క్యాలెండర్లో మూడు రోజులు గడిచిపోయాయి జూలై 4వ తేదీ కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలోని కాటూరు అనే చిన్న గ్రామంలో ఉదయించిన విప్లవ సూర్యుడే మోహనరంగా.

రంగా ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వ్యాపార నిమిత్తం విజయవాడ చేరుకోవడం జరిగింది. పుట్టింది కాటూరులో అయినా పెరిగింది విజయవాడలోనే. తాను పెరిగిన సమయంలో ఏ రోజు రంగ ఊహించి ఉండడు ఇదే నగరానికి తాను శాసనసభ్యులు అవుతానని, పీడిత తాడిత బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేస్తానని వీరమరణం పొందుతానని తన మరణము ఒక ఉద్యమరూపాన్ని సంచరించుకుంటుందని రంగా బాల్యంలో ఊహించి ఉండరు.

తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన వంగవీటి మోహన్ రంగా జైలు గోడల మధ్యన నుండి నామినేషన్ వేసి శాసనసభ్యులుగా గెలుపొంది.. తెలుగు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.

రంగా గారి ఎదుగుదలను తద్వారా ఓ సామాజిక వర్గం రాజకీయంగా ఎదుగుదలను జీర్ణించుకొని కుటిల వర్గాల కుట్రలకు బలైపోయిన విప్లవ వీరుడు వంగవీటి మోహన రంగా.

రంగా గారిని హత్య చేయించడం అంటే ఒక ఒక వ్యక్తినొ సన్మోహ శక్తినొ అంతమొందించడమే కాదు. ఒక బలమైన సామాజిక వ్యవస్థను ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుండి వేరు చేయడమే.

స్వర్గీయ వంగవీటి మోహన రంగా భౌతికంగా మన మధ్యన లేకపోయినా, ఎన్నో ఆశయాలను మనకు వదిలి వెళ్లారు. రంగా ఆశయాలను నెరవేరే విధంగా యువతి, యువకులు మోహన్ రంగా గారి స్ఫూర్తితో ముందుకు నడిచి, రాజకీయంగా, సామాజిక వర్గంగా ఉద్యమించి.. రంగా ఆశయ సాధన కోసం కృషి పెడన నియోజకవర్గం చేయాలని జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు సమ్మెట విజ్ఞప్తి చేశారు. జోహార్ వంగవీటి మోహన రంగా..