ఆదివాసి సంఘాలతో, గిరిజన నాయకులతో బంద్ లో పాల్గొన్న చిర్రి బాలరాజు

పోలవరం, అసెంబ్లీలో వాల్మీకి, బోయలను ఎస్టి జాబితాలో చేరుస్తూ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బుట్టాయిగూడెం మండలంలో ఆదివాసి సంఘాలతో, గిరిజన నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ లో చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున గిరిజనులతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించి గిరిజన నాయకునాలు తీసుకునే నిర్ణయాలకు గిరిజనుల కోసం ఎంతటి దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియచేయడనది. 40 లక్షల ఓట్ల కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టింది అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాలు, ఆదివాసి నాయకులు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.