గాఢ నిద్రలో ఉన్న సీఎం మొద్దునిద్ర వీడాలి: అనంతసాగరం జనసేన

*3 వ రోజు #GoodMorningCMSir

అనంతసాగరం: గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాం ను అనంతసాగరం మండలంలోని మినగలు, ముత్తుకూరు నుంచి పాత దేవరపల్లి దగ్గర వరకు రోడ్లు చాలా అధ్వాన దుస్థితి ఉన్నాయని గాఢ నిద్ర ఉన్న రాష్ట్ర సీఎం జగన్ రెడ్డి గారిని నిద్ర లేపుతూ #GoodMorningCMSir హాష్ టాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ.. రోడ్లమీద ప్రయాణిస్తున్నప్పుడు గోతులు ఉండడం సహజం కానీ.. మన రాష్ట్రంలో గోతులు మధ్య ఉన్న రోడ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిద్ర మత్తులో ఉన్న సీఎం గారు ఇప్పటికైనా నిద్ర మేల్కొని రాష్ట్రంలో ఉన్న రోడ్లను మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ, సుభానీ, రసూల్, రఫీ జన సైనికులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.