నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణం వెంటనే చేపట్టాలి: నూజివీడు జనసేన

నూజివీడు నియోజకవర్గం, వలసపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్ నిర్మాణం వెంటనే చేపట్టాలని నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, ముసునూరు మండల అధ్యక్షుడు అబ్బూరి రవి కిరణ్ డిమాండ్ చేసారు. వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళుగా గ్రామ ప్రజలకు మంచి నీటిని కూలిపోయే స్థితిలో ఉన్న ట్యాంక్ ద్వారానే సరఫరా చేస్తున్నారని.. దాని ద్వారా మంచి నీరు కాలుష్యం, తుప్పు వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. వారికి వెంటనే ప్రభుత్వం నూతన ట్యాంక్ నిర్మాణం చేసి వారి సమస్యను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు కుమ్ముకూరి సురేష్, పల్లి రాజు, జనసైనికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.