శ్రీకాళహస్తిపై కరోనా ప్రభావం… రాహు-కేతు పూజలు మినహా అన్నీ ఏకాంతమే!

నిత్యమూ భక్తులతో కిటకిటలాడే శ్రీకాళహస్తి దేవాలయంపై కరోనా ప్రభావం పడింది. చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న వేళ, అధికారులు దర్శన వేళల్లో మార్పులతో పాటు, కొత్త ఆంక్షలను విధించారు. ఈ ఉదయం నుంచి శ్రీకాళహస్తి దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి దర్శనాలను కల్పిస్తామని తెలిపారు.

ఆలయంలో ప్రత్యేకంగా జరిగే రాహు – కేతు పూజలను మాత్రం అనుమతిస్తామని, మిగతా అన్ని ఆర్జిత సేవలూ ఏకాంతంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. పూజలకు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, పూజలు చేసుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.