శంకరం పంచాయతీయువతకు క్రికెట్ కిట్ పంపిణి

మాడుగుల నియోజకవర్గంలో జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సహాయంతో మాడుగుల మండలం, శంకరం పంచాయతీలో వెలగపాడు గ్రామానికి రాజారెడ్డి చేతుల మీదుగా క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి మాట్లాడుతూ ఇటీవల మాడుగుల నియోజకవర్గంలో 2023 జనసేన క్యాలెండర్ లను గ్రామంలో ఉన్న కొందరు యువకుల ద్వారా ప్రతి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలగపాడు గ్రామ జనసైనికులు మరియు శంకరం పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.