ఇప్పటంలో అక్రమ అరెస్టులు

మంగళగిరి, ఈ సంవత్సరం మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో సభ నిర్వహించడం జరిగింది. అధికార పార్టీ వారు జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా ఆయన అడ్డుకోవాలి అనే ఆలోచనతో సభ నిర్వహించుకోవడానికి స్థలం లేకుండా చేయాలని ఎన్నో అడ్డంకులు కల్పించడం అందరికీ తెలిసిందే. కానీ అధికార పార్టీ బెదిరింపులకు తలవంచకుండా ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభని మా పొలాల్లో మా గ్రామంలో చేసుకోండి అని ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీకి మద్దతు తెలిపి సభ ఏర్పాటుకు సహకరించారు. అధికార పార్టీ వారు ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన పార్టీ వారికి ఆవిర్భావ దినోత్సవసభ జరుపుకోవటానికి వారి పొలాలు ఇచ్చినందుకు వారిపై కక్షకట్టి శుక్రవారం ఇప్పటి గ్రామంలో రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి గ్రామంలో ఇల్లు కూల్చడం జరుగుతుంది. ఈ కూల్చే విధానంపై అడ్డు పడిన జనసైనికులను గ్రామస్తులను అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటం గ్రామంలో జరిగిన సంఘటనలో అరెస్టు కాబడిన గ్రామ ప్రజలను, జనసైనికులను తెనాలి నియోజకవర్గం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ నందు ఉంచటం జరిగింది. ఈ విషయం తెలిసిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారిని కలిసి అక్కడ ఏమి జరిగిందో ఆ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది.