ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది: పెండ్యాల శ్రీలత

• అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులను బేషరతుగా వదిలి పెట్టాలి
• పోలీసు వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తుంది
• ప్రజా సమస్యలు తెలుసు కోవడానికి వస్తే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలని చూస్తారా
• రాష్ర్టంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చుపెట్టి రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తుంది

  • జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రమానికి చేరుకుని అక్కడనుంచి ర్యాలీ ద్వారా నోవాటెల్ కు చేరుకొని అక్కడే బస చేసి మరిసటి రోజు ప్రజా సమస్యలను తెలుసుకోవటానికి జనవాణి కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా.. పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మా పార్టీ ఉత్తరాంధ్ర ప్రధాన నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను దాదాపు 100 మందిని అరెస్టు చేసి నోవాటల్ హోటల్ చుట్టూ 144 సెక్షన్ విధించి నలువైపులా పోలీసులు మోహరించడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మీడియా ముఖంగా ఆమె తెలియజేశారు.

అదేవిధంగా శనివారం ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు వైసిపి ముసుగులో విశాఖ గర్జనను చేపట్టారు అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదలి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అందరూ వచ్చినప్పటికీ గర్జన సభ వెలవెల పోవడంతో రాష్ట్ర ప్రజలను మరొక్కసారి మభ్యపెట్టడానికి మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపుతూ వైసిపి పైడ్ ఆర్టిస్టులతో సినిమా సీన్లను తలదన్నేలా అడపాదడపా దాడులు చేయించుకొని ఆ దాడుల నెపం మా పార్టీ కార్యకర్తలు, నాయకులపై రుద్ది మా పార్టీని దోషిగా చూపించి అటు విశాఖ పేలవ గర్జనను తప్పుదోవ పట్టించడానికి మరియు వారి పార్టీ స్వలాభం కోసం వైసీపీ మంత్రులే వారిపై ఒక పక్కా ప్రణాళికతో దాడి చేయించుకున్నారని గర్జన సభలలో కూడా మంత్రులు మాట్లాడిన తీరు చూస్తుంటే జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని మేము తెలియజేస్తున్నాం.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం విమానాశ్రమానికి చేరుకుంటారని అక్కడ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఉంటారని మంత్రులకు సమాచారం ఉన్నప్పటికీ వారు పక్కా ప్రణాళికతోనే సెక్యూరిటీ లేకుండా అటుగా వచ్చి ఈ దాడులు వారే చేయించుకున్నారని మేము విశ్వసిస్తున్నామన్నారు.

ఇక పోలీసులు పక్కాగా వైసిపి అవినీతి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ వ్యవహరిస్తున్న తీరు అమానుషమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి గాని మాకు గాని పోలీసు వ్యవస్థ అంటే ఎంతో గౌరవం అని ఆ గౌరవం ప్రకారమే పవన్ కళ్యాణ్ విమానాశ్రమానికి చేరుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది సార్ మీరు కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేయాలంటే దాదాపు గంట పాటు విమానాశ్రమం లోపలే ఉండిపోయి తర్వాత బయటకు వచ్చారని ఇది పోలీసులకు మా అధ్యక్షులు వారు ఇచ్చే గౌరవం అని తెలియజేసారు. అనంతరం ర్యాలీగా నోవాటెల్ కు బయలుదేరగా దారి పొడవునా ప్రజలయితేనేమి మా జనసేన శ్రేణులు అయితేనేమి పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పట్టారు. ఇది చూసి జీర్ణించుకోలేని వైసీపీ అవినీతి ప్రభుత్వం కరెంట్ బంద్ చేపించి వీధిలైట్లు అర్పించేశారు. అయినప్పటికీ ముక్కుఓని సంకల్పంతో పవన్ కళ్యాణ్ అభిమానుల మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులోనే ర్యాలీ సాగింది. ఇది కూడా జీర్ణించుకోలేని ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకంగా డీసీపీ స్థాయి అధికారి పవన్ కళ్యాణ్ కారుపైకి ఎక్కి మీరు కారు లోపల నుంచి బయటకు రాకూడదు, అభివాదం చేయకూడదని చెప్పి జనసేన శ్రేణులను లాఠీ దెబ్బలతో పూర్తిగా చేదరగొట్టే ప్రయత్నం చేశారు. తీరా నోవాటెల్ కి పవన్ కళ్యాణ్ చేరుకోగా పోలీసులు అర్థరాత్రి హైడ్రామాకు తెరలేపుతూ హోటల్ నలుమూలలా చుట్టుముట్టి 144 సెక్షన్ విధించి జనసేన ముఖ్యనేతలను దాదాపు 15 మందిని అక్రమంగా అరెస్టు చేసి అక్రమ కేసులు బదలాయించి సెక్షన్ 307 వంటి హత్యాయత్నం వంటి కేసులను బదలాయించారని ఏకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి (41-ఏ) కింద కారణం తెలపకుండ నేటిసులు ఇచ్చారని ఇది ఎంతవరకు సమంజసమని ఏది ఏమైనా మా పార్టీ నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను బేషరుతుగా విడుదల చేయకపోతే రాష్ట్రంలో మరొక ఉద్యమం చవిచూడాల్సి వస్తుందని ఈ వైసీపీ చంచల్ గూడ దత్తపుత్రుడిని, తమ శాఖలను మరిచి వ్యవహరిస్తున్న అవినీతి మంత్రులని, ఎమ్మెల్యేలని అనంతపురం జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి తదితరులు పాల్గొనడం జరిగింది.