కూనవరంలో దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారం

రాజోలు మండలం, కూనవరం గ్రామంలో రాజోలు నియోజకవర్గ జనసేన-టీడిపి-బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడిపి మండల అద్యక్షులు గుబ్బల శ్రీనివాస్, జనసేన ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం అధ్వర్యంలో గ్రామంలోని ముఖ్యనాయకులతో మాట్లాడుతూ గ్రామ సమస్యలు తెలుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు త్రాగు నీరు, రోడ్లు మొదలగునవి అభివృద్ది చేసుకుందాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన-టీడిపి-బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.