ఇరగాయి గ్రామంలో శిథిలావస్థ పాఠశాల భవనం

*జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, మండల నాయకులు బిమిడి మత్యరాజు నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

విశాఖపట్నం జిల్లా అరకు వేలి మండలం మారుమూల ఇరగాయి పంచాయితీ ఇరగాయి గ్రామంలో మాదాల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ బిమిడి మత్యరాజు ఆదివారం ఇరగాయి గ్రామ పంచాయితీలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమైన అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల భవనాన్ని తనిఖీ చేశారు విద్యార్థులు పాఠశాలలో కూర్చుని చుదువుకోవడానికి సరైన స్థలం కూడలేదని వర్షాకాలంలో అయితే పూర్తిగా సెలవు ప్రకటించవలిసిందేనని విద్యార్థులు విద్యార్థుల తల్లి తండ్రులు తెలిపారు పంచాయితీలొనే పాఠశాల భవనం ఇలా ఉందంటే మారుమూల గ్రామాల్లో పాఠశాల భవనాలు ఎలా ఉన్నాయో ఈ పాఠశాల చూస్తే తెలుస్తుంది పిల్లలకు బడికి పమపాలంటేనే భయమేస్తోంది అని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఇరగాయి గ్రామంలో ఎప్పుడో నిర్మించిన పాఠశాల భవనం ఇప్పుడు పడిపోయే ప్రమాదంలో ఉంది. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాల భవనం పడితే మా పిల్లల పరిస్థితి ఎవరికి చెప్పాలి అంటీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాడు నేడు కింద పాఠశాల భవనం మంజూరు చేయాలని జనసేనపార్టీ తరుపున పిల్లల తల్లిదండ్రులు కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుకురు అప్పలరాజు, మధు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.