పెదబరడ గ్రామంలో జనసేన కరపత్రాల ఆవిష్కరణ

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్ శుక్రవారం పెదబరడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన యువతతో సమావేశమై స్థానిక గ్రామ సమస్యలు, గిరిజన నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వం చేయుతనిచ్చి ఉపాధి కల్పనకు చేయాల్సినటువంటి అంశాలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై వారితో మాట్లాడారు. అలాగే నియజకవర్గం తరుపున ప్రాతినిధ్యం వహించే గిరిజనప్రజాప్రతినిధులు అవలంబించే గిరిజన ద్రోహపు విధానాలు చూస్తూ ఎంతకాలం సహిస్తామని, ఇటువంటి గిరిజన ద్వంద విధానాలపై గిరిజన యువత ఏకతాటిపైకి వచ్చి ఎదిరించాలని, అన్నారు అనేక మారుమూల గ్రామాల్లో కనీసం రోడ్డు సౌకర్యం లేక డోలి మోతలతో గర్భిణీ స్త్రీలను, రోగులను మండల కేంద్రాల్లో గల ఆస్పత్రులకు చేర్చే ఈ లోపే సమయం వృధా కారణంగా దారి మధ్యలోనే ప్రాణాలు వదలడం గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ప్రతినిధులకు ఎంత మొరపెట్టుకున్నా ఇటువంటి అంశాలు కాదని, గడప, గడపకు మన ప్రభుత్వమనే కార్యక్రమం చేస్తూ పార్టీ విధానాలు చెప్తూ తమ పదవుల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు తప్పితే ఏనాడైనా తమ గిరిజన జాతి ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే తమకు దక్కిన మహాదావకాశమే ఈ పదవులని ఎందుకు బావించట్లేదో ఇప్పటికి అంతుపట్టడం లేదని, బహుశా వారి దృష్టిలో రాజకీయాలంటే వారికి తెలిసిన సత్యం ఇంతేనేమోనని అన్నారు. ఈ సారి గిరిజన ప్రజలు నిజాయితీగా ఓటువేస్తే? తమ జాతి ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని నిజమైన ఆదివాసీ గిరిజనులుగా శిత్తశుద్దితో ఆలోచన చేస్తే? ఆదివాసీ ద్రోహపు పార్టీలైన టీడీపీ, వైసీపీలకి డిపాజిట్స్ కూడా రావని, కానీ అంత సూక్ష్మ జ్ఞానం మన గిరిజన ప్రజలకు లేవని అన్నారు. ఈ సందర్బంగా పెదబరడ గ్రామ యువతతో జనసేన పార్టీ ప్రభుత్వానికి సంధించిన 12 అంశాల గిరిజన సమస్యలను తెలిపే కరపత్రాన్ని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య ఆదేశాలతో ఆవిష్కరించి, ప్రజలకు జనసేన పార్టీ విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో పెదబరడ యువత పాల్గొన్నారు.